ఒక్కో సిలెండర్ పై రూ 50 పెంపు—- ప్రజలకు గోరుచుట్టుపై రోకటిపోటులా గ్యాస్ ధర పెంపు—-డిసి గోవిందరెడ్డి.

మన న్యూస్: కడప జిల్లా: పోరుమామిళ్ల: ఏప్రిల్ 11: దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ,డీజిల్ రేట్లు ఏపీలోనే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,గ్యాస్ సిలెండర్ రేట్లు పెంచడం అమానుషమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. సామాన్యుడి వంటింట్లో గ్యాస్ ధరలు మంటలు పుట్టిస్తున్నాయన్నారు. గత కొన్ని రోజులుగా వాణిజ్య సిలెండర్ ధరలను పెంచుతూ వస్తున్న ప్రభుత్వం తాజాగా గృహ వినియోగ దారులకు వాత పెట్టిందన్నారు. వంట గ్యాస్ ధరను కేంద్రం రూ 50 పెంచి పేద,సామాన్య జనం నడ్డి విడిచిందన్నారు. ఉజ్వల్ యోజన పథకం క్రింద అందచేసే సిలెండర్ పై కూడా రూ 50 భారాన్ని మోపారాన్నారు.సామాన్య, మధ్య తరగతి ప్రజలకు గ్యాస్ ధరలు భారం అవుతున్నాయన్నారు.14.2 కేజీల ఎల్ పి జి గ్యాస్ సిలెండర్ ధర రూ 853 నుంచి రూ 903కు చేరిందన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు సిలెండర్ రేటు పెంచడం భారంగా మారిందన్నారు.కూరగాయల ధరల నుంచి కిరాణా సరుకుల వరకు ధరలు పెరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రవేశపెట్టిన దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్లు చాలామందికి అందడం లేదన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారని, ముందుగా వినియోగదారులు సిలిండర్‌ ధర ఏజెన్సీలకు చెల్లించాలని, రెండు రోజుల్లో ఆ డబ్బులు మొత్తం సబ్సిడీ కింద వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారన్నారు.ఈ మేరకు తొలివిడత కింద ఇప్పటివరకూ ముప్పై, నలభై శాతం మందికి సిలిండర్‌ రాయితీ డబ్బులు వారి ఖాతాకు జమ కాలేదన్నారు.తొలి సిలిండర్‌ సరఫరాకు మార్చి 31 న గడువు ముగిసిందని, ఏప్రిల్ 1 నుంచి రెండవ సిలెండర్ పంపిణీ పక్రియ మొదలైందన్నారు. మొదటి సిలిండర్‌ సబ్సిడీ తమకు వర్తిస్తుందో లేదోనని మిగిలిన గ్యాస్‌ వినియోగ దారులు ఆందోళన చెందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు కోరారు.దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ,డీజిల్ రేట్లు మన రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ,డీజిల్ రేట్లు మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ 109.22, కర్ణాటక లో లీటర్ పెట్రోల్ ధర 102.92, తమిళనాడు లో లీటర్ పెట్రోల్ ధర రూ 101.84 ఉందన్నారు. పొరుగు రాష్ట్రాలలో మనకంటే తక్కువ రేట్లు వున్నాయన్నారు. అన్ని రాష్ట్రాల కన్నా డీజిల్,పెట్రోల్ ధరలు రూ 10 తగ్గి ఉండేలా చేస్తామని కూటమి పెద్దలు ఎన్నికల సమయంలో చెప్పారని, ఆ మేరకు కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని వారు అన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!