

జిల్లాలో బీసీల అభివృద్ధికి సహకరించండి జిల్లా టిడిపి నాయకులు శ్రీధర్ యాదవ్
మన న్యూస్, ఎస్ఆర్ పురం:- రాష్ట్ర గనులు మరియు ఎక్సెస్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం తిరుపతిలో మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధికి ముందుకెళ్తూ ఉందని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను మంత్రికి వివరించారు ఆయన స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు శ్రీధర్ తెలిపారు.జిల్లాలో బీసీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నలిగి పోయారని వారిని ఆదుకొని అభివృద్ధికి తోడ్పడాలని ఆయన మంత్రి కోరారు.