

మన న్యూస్,తిరుపతి : ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న 33 వ డివిజన్ లోని ఇళ్ల స్థలాలకు వెంటనే పట్టాలు ఇప్పించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, 33 వ డివిజన్ ఇంచార్జ్ వి పుష్పా వతి యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు వినతిపత్రం సమర్పించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే, తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి సుగుణమ్మ నేతృత్వంలో ఆమె ఇంటి వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ లో తిరుపతి నియోజకవర్గానికి చెందిన పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్ 33వ డివిజన్లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న నిరుపేదలు, కార్మికులు ఇళ్లు నిర్మించుకున్నారు కానీ, వాటికి గతంలో వైసిపి ప్రభుత్వం గానీ పట్టించుకుని ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ చొరవ తీసుకొని 33వ డివిజన్లోని వారందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తారని ఆశిస్తున్నానని పుష్పావతి యాదవ్ చెప్పారు.
