

మన న్యూస్, తిరుపతి:తిరుపతి మాజీ శాసనసభ్యులు మబ్బురామిరెడ్డి కుమారుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం, బిజెపి,జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి దుస్సాలువల తో సత్కరించి జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. కేక్ లు కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మబ్బు దేవనారాయణరెడ్డి అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. తిరుపతి రూయ ఆసుపత్రి వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. అనంతరం దాదాపు 100 మంది యువకులు రక్తదానం చేయగా తిరుచానూరులోని నవజీవన్ కేంద్రంలో పిల్లలకు పండ్లు పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి రెండుసార్లు శాసనసభ్యులుగా తిరుపతి అభివృద్ధికి బీజం వేశారని గుర్తు చేశారు.. ఆయన వారసత్వాన్నిపునికి పునికి పుచ్చుకున్న ఆయన తనడు మబ్బు దేవనారాయణ రెడ్డి ప్రజల మనిషిగా ఎదుగుతూ ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకుంటున్నారని కొనియాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్ బట్టు రవిశంకర్ రెడ్డి, సిద్ద రెడ్డి,వాసుదేవరెడ్డి, చంద్రబాబు, కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, శేఖర్, నాగూర్, మూర్తి పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు.
