అంతర పంటలు పలు పంటల విధానమే మేలు వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 9:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఏకపంట విధానంతో పోలిస్తే అంతర పంటలు పలుపంచల విధానం ఎంతో మేలని భూసారాన్ని పరిరక్షించడమే కాకుండా అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. కేసలీ గ్రామంలో రైతుల సమావేశంలో మాట్లాడుతూ రైతులు కేవలం రసాయన ఎరువుల మీదే ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తుండడం వలన గత మూడు సంవత్సరాల తో పోలిస్తే వ్యవసాయ దిగుబడులు తగ్గుతూ రసాయన ఎరువులు పై పెట్టుబడులు పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారని దీనిని నివారించాలంటే పంట మార్పిడి పాటించాలని లేదా పిఎండిఎస్ నవధాన్య విత్తనాలు చల్లిన తర్వాత మాత్రమే ప్రధాన పంటను వేసుకోవాలని ప్రధాన పంట లో కూడా చిరుధాన్యాలు కూరగాయలు అపరాలు వంటివి అంతర పంటలుగా వేసుకుంటే భూసారం పెరగడమే కాకుండా భూమి లోపల బయట జీవావరణ వ్యవస్థ మెరుగుపడి జీవ వైవిధ్యం పెరుగుతుందని తద్వారా చీరల పేడల ఉధృతి ఘనంగా తగ్గుతుందని తెలిపారు. గ్రామంలో పెంట కుప్పలు ఎక్కువగా ఉన్నాయని ద్రవ జీవామృతం ఉపయోగించి టైప్ టు ఘన జీవామృతాన్ని తయారు చేసుకుని పంట పొలాలకు వినియోగించుకుంటే అనేక రెట్లు పోషకాలు పంటకు అందడమే కాకుండా భూమిలో సేంద్రీయ పదార్థం పెరుగుతుందని సూచించారు అనంతరం రైతు మీసాల మోహన్ రావు గులి పద్ధతిలో సాగుచేసిన చోడి పంటను పరిశీలించారు గులి పద్ధతిలో చోడి పంట దిగుబడులు చాలా బాగున్నాయి అని రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అనంతరం ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేస్తున్న మిరప,టమోటా,వంగ, పంటలను పరిశీలించారు. అనంతరం చిరుధాన్యాలు మరియు నవధాన్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ గ్రామంలో ర్యాలీని కొనసాగించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు రాకేష్ కుమార్ మరియు రైతులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..