

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 9: బద్వేల్ పట్టణంలోని గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొలపర్తి హేమంత్ గుప్తా జన్మదినోత్సవం పురస్కరించుకొని బుధవారం మైదుకూరు రోడ్ లోని మంచినీటి చలివేంద్రం వద్ద సుమారు 400 మందికి పైగా ప్రజలకు వితరణ చేయడం జరిగింది, మజ్జిగ వితరణకు సహకరించిన హేమంత్ గుప్తాకు శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది,ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కేవీ సుబ్బారావు, సెక్రటరీ కొలిశెట్టి నాగరాజు, ఆవుల శ్రీనివాసులు, సురేష్, నేలపాటి వెంకటసుబ్బయ్య తో పాటు పలువురు పాల్గొన్నారు.
