

మన న్యూస్: కడప జిల్లా: బ్రహ్మంగారిమఠం: ఏప్రిల్ 9 పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మంగారిమఠం ఐదు రోడ్ల కూడలిలో బుధవారం ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ గృహ అవసరాల కు వినియోగించే సిలిండర్లకు ఉజ్వల పథకం లబ్ధిదారులకు 50 రూపాయలు పెంపు దారుణం అన్నారు. ఇప్పటికే దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్న దశలో నిత్యవసరాలైన గ్యాస్ ధరను పెంచడం ప్రజల నెత్తిన బండవేయడమే అన్నారు. ఇప్పటికే సామాన్య మద్దతు ప్రజలు నిత్యవసర సరుకుల ధరలు ఆకాశానంటే రీతిలో ఉన్న పరిస్థితులలో ఇప్పుడు ఈ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం మరింత భారం అయ్యే పరిస్థితి కనబడుతుందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్ పథకం పైన కూడా భారం పడుతుంది అని కాబట్టి పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని వారు అన్నారు. అదేవిధంగా అంతర్జాతీయంగా ముడిచముర ధరలు తగ్గినందున అందుకు అనుగుణంగా ఇక్కడ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలపై భారాలు తగ్గించాల్సింది పోయి ఎక్సైజ్ ఇంకా ఇప్పించి కేంద్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకోవడం దారుణం అన్నారు. పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదని ప్రచారం చేసుకోవడం ప్రజలను మభ్యపరచడమే అని వారు అన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురుల ధరలు పెంచినప్పుడు పెంచడం తగించినప్పుడు ముడిచములు ధరలు తగ్గినప్పుడు కూడా పెంచడం ప్రజలను వంచించడమేనని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని లేనిపక్షంలో ప్రజలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధమవుతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భాస్కర్, వీరనారాయణ, రమణ, ఆనందరావు, ఆంజనేయులు, చినబ్బి, రామ కృష్ణ రెడ్డి, చక్రవర్తి, ఆటో యునియన్ నాయకులు పాల్గొన్నారు.
