

మన,న్యూస్,వైయస్సార్ కడప:బద్వేల్ బద్వేల్ మున్సిపాలిటీ శ్రీ కృష్ణ దేవరాయ నగర్ నందు గల శివాలయం వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆహ్వాన మేరకు దేవుడిని దర్శించుకొని,పూజ కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే డా. దాసరి సుధ .అనంతరం ఆలయ కమిటీ వారు దుస్సాలువతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి, జడ్.పి.చైర్మన్ గోవింద రెడ్డి,మున్సిపల్ ఛైర్మన్ రాజగోపాల్ రెడ్డి,మున్సిపాలిటీ అధ్యక్షుడు సుందర రామిరెడ్డి,బద్వేల్ యం.పి. పి రామ సుబ్బారెడ్డి,సీనియర్ నాయకులు పోలి రెడ్డి ఇతర ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు
