

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం లో నార్లవలస పంచాయతీ సహాయకుడు పై విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలి జాబ్ కార్డు ఉన్నవారందరికీ పని ఇవ్వాలి ఉపాధి కూలీ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సాలూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తాడంగి గాసి మాట్లాడుతూ నార్లవలస పంచాయతీ క్షేత్ర సహాయకుడు కూలీలకు పని అడుగుతున్న పని ఇవ్వకుండా అందుబాటులో లేకుండా ఉన్నారని తెలిపారు అనేక సందర్భాల్లో అడుగుతున్న ఉపాధి పనులు కల్పించడం లేదని తెలిపారు కావున క్షేత్ర సహాయకుడిపై సమగ్ర విచారణ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పని కావాల్సిన వాళ్ళందరికీ పని ఇవ్వాలని కోరారు మండలంలో జనవరి నెల నుండి ఇప్పటివరకు ఉపాధి పనులు చేసిన కూలీలకు కూలి డబ్బులు చెల్లించకపోవడం సరికాదని చట్ట ప్రకారం పనిచేసి 14 రోజుల్లో కూలి డబ్బులు చెల్లించాల్సి ఉన్న చెల్లించలేదని తెలిపారు పనిచేసే చోట నీడ నీళ్లు వంటి మొగులకు సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు నిర్లక్ష్యంగా ఉన్న నార్లవలస క్షేత్ర సహాయకుడు పై సమగ్ర దర్యాప్తు జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనియెడల కూలీలను సమీకరించి ఆందోళన పోరాటానికి సిద్ధపడతామని తెలిపారుఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు వంతల సుందర్రావు కూనేటి చినబాబు నాగేశ్వరరావు రాము సన్యాసిరావు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
