

మనన్యూస్,నర్వ:మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలో బాలుర జూనియర్ కళాశాల మంజూరు అయిందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గతంలో ప్రకటించారు. మరి జాండ్రగుట్ట దగ్గర స్థలం కూడా నిర్ణయించారు. అక్కడ చదును చేయడానికి 40 లక్షలు కేటాయించారని వార్త పత్రికలలో కూడా వచ్చింది. ఏది ఏమైనా మరి కళాశాల మంజూరు అయ్యిందా? కాలేదా? మంజూరు అయితే ఇంతవరకు ఎందుకు పనులు ప్రారంభించలేదు లేదు అని బిఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు.ఈ నర్వ మండలంలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని నర్వ మండలంలోని విద్యార్థులకు ఆ కళాశాలని రాబోయే విద్యా సంవత్సరానికి త్వరగా అందుబాటులోకి తేవాలని BRS నేతలు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో BRSమండల యువ నాయకులు,లక్కర్ దొడ్డి మాజీ సర్పంచ్ శివ,గాళ్ల రాజారెడ్డి, ఎల్లంపల్లి నాగరాజు,దండు అజయ్,కావాలి క్రిష్ణ,Md షఫీ పాల్గొన్నారు
