

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కాంటకు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పిట్లం ఏఎంసీ ఛైర్మన్ మనోజ్ కుమార్,నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, సీఈఓ సంగమేశ్వర్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ పటేల్, పండరి,వెంకట్రామిరెడ్డి,ఏవో అమర ప్రసాద్,ఏపీఎం రామనారాయణ గౌడ్, రైతులు ఉన్నారు.