


మన న్యూస్,నిజాంసాగర్, నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో సోమవారం రామాలయం మందిరం వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కుస్తీ పోటీలు నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
ఇలానే ప్రతి సంవత్సరం ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తుంటారు.ఈ కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర,కర్ణాటక, జహీరాబాద్ ,నారాయణఖేడ్, తదితర ప్రాంతాల నుంచి నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఉదయం కొబ్బరికాయ కుస్తీ పోటీల నుంచి మొదలైన కుస్తీ పోటీలల్లో మల్లయోధులు ఆసక్తి చూపించారు.కుస్తీ పోటీల్లో గెలుపు పొందిన మరలయోధులకు నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గజ్జల రాములు, సంకు లక్ష్మయ్య,చిట్యాల నారాయణ,చాకలి రమేష్, పిట్ల సత్యనారాయణ,బొడ్డు అంజయ్య,మంగలి ఎల్లయ్య, చిట్యాల శేఖర్,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
