

మనన్యూస్,ఉదయగిరి:మండల కేంద్రమైన ఉదయగిరి లో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమానికి అధికారుల డుమ్మా
నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉదయగిరి అధికారులు ప్రవర్తిస్తున్న తీరు అర్జులు చేత పట్టుకొని పడిగాపులు కాస్తున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధికారులను పలుమార్లు మందలించిన కూడా తమ విధివిధానాలు ఎలాంటి మార్పులు చేసుకోవటానికి వారికి ఇష్టం లేనట్లు ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు,శిశు సంక్షేమ శాఖ అధికారులు.. విద్యుత్ శాఖ అధికారులు.. పంచాయతీరాజ్ శాఖ అధికారులు.. ఇరిగేషన్ శాఖ అధికారులు.. ఆర్డబ్ల్యూఎస్ శాఖ.. విద్యాశాఖ.. వెలుగు శాఖ అధికారులు.. సంబంధించిన అధికారులు కార్యక్రమానికి గైరాజరవడంతో అర్జీలు పట్టుకొని వచ్చిన ప్రజలు తాసిల్దార్ కార్యాలయంలోని చెట్ల కింద పడి కాపులు కాస్తూ ఎదురుచూస్తున్నారు..
జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కలెక్టర్ ఆదేశాలను బేకాతరు చేస్తూ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు ఉన్నత అధికారులకు సైతం ఇస్మాయానికి గురిచేస్తుంది
