

తవణంపల్లి, మన న్యూస్ , ఏప్రిల్ 05,2025:* మాజీ మంత్రివర్యులు శ్రీమతి గల్లా అరుణ కుమారి మరియు అమర రాజా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ గల్లా రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో స్యతంత్ర సమరయోధులు, మాజీ ఎంపీ కి. శ్. శ్రీ. పాటూరు రాజగోపాల్ నాయుడు 105వ జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా, తవనంపల్లి మండల, దిగువమాగం గ్రామం నందు గల రాజన్న మెమోరియల్ పార్క్ నందు శ్రీ. రాజగోపాల్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మరియు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తో కలిసి రాజగోపాల్ నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం గల్లా అరుణ కుమారి ముద్దుల మనమడు యువ హీరో గల్లా అశోక్ కి కూడా జన్మదినం సందర్భంగా గల్లా అశోక్ అభిమానులు మరియు సమీప గ్రామాల ప్రజలు బారి కేక్ నీ కట్ చేసి గల్లా అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి అశోక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ శ్రీ పాటూరు రాజగోపాల్ నాయుడు గారి జీవితం ఎంతోమంది యువతీ యువకులకు ఆదర్శ దాయకం మరియు ఆయన తీసుకున్న అనేక సంస్కరణలు ద్వారా ఎంతోమంది విద్యార్థులకు వారి పురోగతికి దోహన పడింది అని అన్నారు. బుద్ధ వెంకన్న మాట్లాడుతూ రాజగోపాల్ నాయుడు రాష్ట్రానికి అపారమైన సేవలు అందించారు, తద్వారా రాష్ట్ర అభివృద్ధి కి తోడ్పడుతోపాటు, విద్య వైద్య రంగాలు అనేక రకాల సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేశారు కావున ఆయన జీవితాన్ని ఇప్పుడున్న అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ నాన్న గారు మరియు అశోక్ జన్మదినం ఒకే రోజు రావటం చాలా సంతోషం గా ఉన్నది ఇద్దరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మరియు అశోక్ సినీరంగంలో అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించారు. గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ రాజగోపాల్ నాయుడు ఎంతో మందికి మార్గదర్శి గా నిలిచారని కొనియాడారు మరియు అశోక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమం లో గ్రామస్థులు చే కోలాటాలు మరియు ఇతర సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి, ఈ కార్యక్రమం లో తవణంపల్లి జడ్పిటిసి సభ్యులు వెంకటేష్, కొండరాజు కాల్వ మాజీ సర్పంచ్ మహేష్, దిగువమాగం సర్పంచ్ గోపి , రాజన్న ఫౌండేషన్ హెడ్ సతీష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మరియు గల్లా అశోక్ అభిమానులు సురేష్ ఎల్లంపల్లి తదితరులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
