

మనన్యూస్,కోవూరు:నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం లోని వివేకానంద హై స్కూల్ 32వ వార్షికోత్సవ వేడుకలకు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామ సుబ్బారెడ్డి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కి ప్రత్యేకంగా స్వాగతం పలికారు.
అనంతరం అపుస్మా నేతలతో కలిసి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…వివేకానంద స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.చుట్టుపక్కల ఉన్న కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా..1500 మంది విద్యార్థులతో వివేకానంద హై స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుండడం .. అభినందనీయమని తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా.. కో కరికులం యాక్టివిటీస్ ను.. తక్కువ ఫీజులతో అందిస్తుండడం..వివేకానంద స్కూల్ అభివృద్ధికి కారణమన్నారు.పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో పాటుగా.. కంప్యూటర్ విద్య, పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు నిర్వహిస్తూ.. విద్యార్థుల అభివృద్ధికి అన్ని విధాల స్కూల్ యాజమాన్యం సహకారం అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అపుస్మా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి, అపుస్మా జిల్లా అధ్యక్షులు శ్రీధర్ , ప్రాసమణి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
