ప్రశాంతమ్మ చొరవతోనే షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యకు పరిష్కారం దొరికింది

మనన్యూస్,కోవూరు:ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అసెంబ్లీలో ప్రస్తావించిన కారణంగానే షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించింది.28 కోట్ల బకాయిలు చెల్లించేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు.13 ఏళ్లుగా తాము చేస్తున్న పోరాటం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృషితో ఫలించిందన్నారు కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని ఆమె నివాసంలో షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘ నాయకులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి పుష్ప గుచ్ఛం యిచ్చి కృతజ్ఞతలు తెలియచేసారు.ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కార్మికులకు చెల్లించాల్సిన 28 కోట్ల బకాయిలను చెల్లించేలా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. తమ పట్ల మానవతా దృక్పధంతో వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కార్మికుల కుటుంబాల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. 13 ఏళ్లుగా దుర్భరమైన తమ జీవితాల్లో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ వెలుగులు నింపారన్నారు. తమ గొంతుకై నిలిచి 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపునకు మార్గం సుగమం చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి కార్మిక కుటుంబాలు రుణపడి ఉంటాయన్నారు. ఇప్పటి దాకా తాము మాటలు చెప్పి మభ్య పెట్టే నాయకులను చూశామని చెప్పిన మాటకు కట్టుబడ్డ నాయకురాలిని తొలిసారిగా చూస్తున్నామన్నారు. గత సంవత్సరం ఏప్రిల్‌ నెలలో బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ.. ఇదే విషయంపై తమ వైఖరిని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలయ్యాక కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ బకాయిలపై ప్రశాంతమ్మ దృష్టి సారించారు.కోవూరును ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చేస్తాం.అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ సాకారం అవుతుండటంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రియల్టర్లకు కట్టబెట్టాలని చూసిన షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 124 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించి ఇండస్ట్రీయల్ హబ్ గా మారుస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ రైతులకు ఆమోద్యయోగ్యమైన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘ నేతలు నారాయణ, ఎంవి రమణ, శివ,మస్తాన్ పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి నాయకులు తిరువూరు అశోక్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 2 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 8 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్