

మనన్యూస్,నారాయణరెడ్డి పేట:ముదిరాజు వీధి నుండి ప్రారంభమైంది.ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్దిన మహిళలు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకుంటున్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ప్రజల వాస్తవిక సమస్యలు తెలుస్తాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించాను అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.
ముచ్చటగా మూడోసారి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి భారీ మెజార్టీ ఇచ్చిన రూరల్ ప్రజలకు రుణపడి ఉంటాం అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.
