

మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం మంగుంట పంచాయతీ దిగువ మంగుంట గ్రామ పరిధిలో పొలంలో ఉన్న రామిరెడ్డి ఇంటికి సీసీ రోడ్డు ను వేస్తున్నారని గ్రామంలో ఉన్న గుంతల మైన రోడ్డు ను వేయడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామంలో పలుచోట్ల సి.సి రోడ్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు నేడు కూటమి ప్రభుత్వం అండదండలతో టిడిపి నాయకుడు, కాంట్రాక్టర్ జీవన్ రెడ్డి, పొలంలో ఉన్నరామిరెడ్డి ఇంటికి ఎంపీ నిధుల ద్వారా తెచ్చిన సిసి రోడ్డును వేయడం ఏమిటని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో పలు సిసి రోడ్లు వేయకుండా ఉన్నాయి. వాటిని వేయకుండా ఓ నాయకుడు ప్రయోజనం కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం ఏంటని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి కానీ ఓ నాయకుల ప్రయోజనం కోసం కాదని అన్నారు.దీనిపై మండల జిల్లా స్థాయిలు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు.

సిమెంట్ రోడ్ లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు