

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో అవసరమని ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ అన్నారు తెలిపారు.శుక్రవారం ఎస్ఆర్ పురం మండలం పెద్ద తయ్యూరు గ్రామం వద్ద క్రికెట్ టోర్నమెంట్ ను ఎస్సై సుమన్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్, డ్రై ఫ్రూట్స్ డీలర్ రాందేవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్సై సుమన్ మాట్లాడుతూ క్రికెట్ ఆట పోటీల్లో గెలుపు ఓటమి సహజం ఎవరైనా అత్యుత్సాహం చేసి క్రికెట్ టోర్నమెంట్ వద్ద గొడవలు చేస్తే క్రికెట్ ఆర్గనైజర్ మీద అల్లరి చేసిన వాళ్ల మీద చర్యలు తీసుకుంటాం అందరూ క్రమశిక్షణగా కలసి మెలసి క్రికెట్ ఆడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ ఆర్గనైజర్ నరేష్ ,చిరంజీవి, రాజకుమార్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.