

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య గజ పూలమాలతో ఘనంగా సత్కరించారు. శుక్రవారం కచపి ఆడిటోరియంలో నరసింహ యాదవ్ కు అభినందన సభ జరిగింది. ఆ సభలో ఆయనను గజ పొలం మాలతో ఘనంగా సత్కరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని సుబ్బరామయ్య ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో వెంకట రాయలు, నాగభూషణం, సుబ్బు యాదవ్ పాల్గొన్నారు.
