

మనన్యూస్,మక్తల్ నియోజకవర్గం:కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా నేడు నర్వ మండలంలోని కల్వల గ్రామంలో రేషన్ షాపులో రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వారితో పాటుగా పలువురు నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్క కుటుంబం సన్నబియ్యం తినాలని ఆలోచనతో ప్రభుత్వం ఇంతటి మహోత్తమైన కార్యక్రమం చేపట్టిందన్నారు.ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ ఎంపిడిఓ జగన్మోహన్ రెడ్డి, చెన్నయ్య సాగర్ కృష్ణారెడ్డి సంజీవరెడ్డి, సుధాకర్ రెడ్డి నరసింహ శరణప్ప రాము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
