

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రములో ధరూర్ మండల నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , రాష్ట్ర డిజిపి జితేందర్ , పోలీస్ శాఖ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి రాష్ట్రస్థాయి పోలీస్ అధికారులు, జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు హాజరయ్యారు. రాష్ట్ర డిజిపి పోలీస్ శాఖ హౌసింగ్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే , గద్వాల ఎమ్మెల్యే శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.ధరూర్ మండల కేంద్రము నూతన పోలీస్ స్టేషన్ భవనానికి ఎమ్మెల్యే , రాష్ట్ర డిజిపి , రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమి పూజ చేసి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి పనులు ప్రారంభించడం జరిగింది.రాష్ట్ర డిజిపి మాట్లాడుతూ.గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రము నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తపరిచారు.ప్రజలకు ఏ చిన్న సమస్యలు ఏర్పడిన పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా పోలీస్ శాఖ తరపున కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.పోలీస్ స్టేషన్ అన్ని రకాల హ్యాంగులతో త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.ఎమ్మెల్యే బండ్ల.కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూగద్వాల నియోజకవర్గం లో ధరూర్ మండలం కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
ధరూర్ మండల ప్రజల 30 ఏళ్ల కల ధరూర్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఉండాలని ప్రజలకు సమస్యలు ఏర్పడినప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్లాలంటే డ్యాం దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది కానీ నేటితో ఆ సమస్యను పరిష్కరించడం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నిర్మాణంకు భూమి పూజ చేయడం జరిగింది త్వరలోనే ప్రజలకు అందుబాటులో పోలీస్ స్టేషన్ ఏర్పాటు కావడం జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా గద్వాల నియోజకవర్గంలో గద్వాల టౌన్ జనాభా పెరగడంతో గద్వాల టౌన్ లో రెండు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి అదేవిధంగా సీ.ఐ కార్యాలయం అగ్రిగేట్స్ చేయాలి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా నిర్మాణం చేయాలని కోరారు.కె.టి దొడ్డి మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్, తో పాటు పోలీస్ క్వార్టర్స్ ను త్వరగా మంజూరు చేసి త్వరగా ఏర్పాటు చేయాలని డిజిపి ని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్ , మాజీ ఆలయం కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, ఉరుకుందు , నవీన్ రెడ్డి, డి.వై రామన్న,చంద్రశేఖర్ భీం రెడ్డి, శ్రీరాములు, వెంకన్న గౌడ్, మల్లికార్జున్ రెడ్డి, టీచర్ గోవిందు, మల్లేష్ గౌడ్, తిమ్మప్ప, పోలీస్ శాఖ అధికారులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
