

ఏజెన్సీలో రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గిరిజన ప్రాంతాల రహదార్లు అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని, సాలూరు నియోజకవర్గంలో 15 ఏళ్లుగా జరగని అభివృద్ధి ఈ పది నెలల్లో జరిగిందని గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. బుధవారం నాడు పాచిపెంట మండలం కేరంగి పంచాయతీ పూడి గ్రామ సమీపంలో ఒక కోటి 25 లక్ష ల రూపాయలు తో నిర్మాణం చేపట్టిన కోదువలస రహదారి ప్రారంభోత్సవం చేసారు. ఈ సందర్భంగా ఆమె గిరిజన సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజలును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా లేని నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఆమె ఎద్దేవ చేశారు. వాళ్లు పత్రికల ద్వారా చేస్తున్న ఆరోపణలు చూస్తే నవ్వొస్తుందని అంతే కాకుండా శిలాఫలకాలు నిలబెడితే అభివృద్ధి కాదని నిధులు తెచ్చి నిర్మాణం చేపడితే దానిని అభివృద్ధి అంటారని ఆమె మరొకసారి వైసీపీ నాయుకులును ఎద్దేవా చేశారు.తాను ప్రారంభిస్తున్న రహదారులు వైయస్సార్ పార్టీ తెచ్చిందని చెప్పుకోవడం హాస్యాస్పదమని మతిలేని విమర్శలని ఎద్దేవా చేశారు. పోదు వలస రోడ్డు 2017 లో మంజూరు అయితే ఇంతవరకు ఎందుకు నిర్మాణం చేపట్లేదని తాను వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి పనులు పూర్తి చేశామని తెలిపారు. సాలూరు నియోజకవర్గం లో 10 నెలల్లో 200 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టామని దాదాపుగా పూర్తికావస్తున్నాయని అభివృద్ధి అంటే ఇది అని తనదైన శైలిలో ఆమె ప్రసంగించారు. కొండమోసూర్ నుంచి అల్లంపాడు రెండు కోట్ల 85 లక్షల రూపాయలు రహదారి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసామని గొప్పలు చెప్పుకున్న వైసిపి నాయకులు మరెందుకు పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. నిధులు లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికి ఇలాంటి విమర్శలు చేయడం తగదు అన్నారు. అలాగే కేరంగి -దొరలొద్దండి గ్రామాల రహదారి మధ్య నిర్మాణానికి 2.90 కోట్లు రూపాయలు మంజూరు చేసామని చెప్పుకున్న వైసీపీ నిధులు లేకుండా ప్రజలను బట్టి పెట్టిందని విమర్శించారు. కానీ తాను మాత్రం ఏజెన్సీలో రహదారులన్నీ పూర్తిచేసి డోలీ మోత లేకుండా గిరిజన ప్రజలకు మంచి పరిపాలన అందిస్తానని సభాముఖంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏజెన్సీ సర్పంచులు ఎంపీటీసీలు అంతా మంత్రి సంధ్యారాణిని కొనియాడారు. మా గ్రామాలు రహదారులు అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందని శభాష్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అంటూ నినాదాలు చేశారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్లు మన రాష్ట్రం ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి మనమంతా రుణపడి ఉన్నామని ఆమె తెలియజేశారు. తుమరావల్లి వీఆర్వో గిరిజన ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నందుకుగాను చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు. గొలుగువలస ట్రావెలింగ్ సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవోకు ఆదేశించారు. రేషన్ డీలర్ సమస్య పరిష్కారం కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా నూతన సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధి ద్యేయంగా మంత్రి సంధ్యారాణి ముందుకు నడుస్తున్నారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇంటి వద్ద ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారని మీ సమస్యలు చెప్పండి పరిష్కరిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రి సంధ్యారాణి మన్యం పులి కాదని, మన్యం సింహమని తలెత్తి చెప్పారు. లీడర్,ఆమె దైర్య శాలి ప్రతి ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు పరితపిస్తూ ఉన్నారని ఆయన పేర్కొన్నారు.పాంచాలి సర్పంచ్ సీనియర్ నేత యుగంధర్ మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గం రోల్ మోడల్ గా తీర్చి దిద్దితారని ఆయన అన్నారు.ఆమె చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ప్రజలకు తెలియజేశారు.ఐటిడిఏ ఈ ఈ మని రాజు మాట్లాడుతూ ఐటిడిఏ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులు గురించి వివరించారు.పై కార్యక్రమము ఎంపీడీవో బీజే పాత్ర అధ్యక్షతన జరిగింది. తాసిల్దార్ రవికుమార్,పలువురు సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు ప్రజలు హాజరయ్యారు.
