

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నరసింహ యాదవ్ ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు మహారాజా టోపీతో శాలువతో ఘనంగా సత్కరించారు. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా నరసింహ యాదవ్ పగిలి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు బీసీ సంఘాల నేతలు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
