

మనన్యూస్,ఎల్బీనగర్:ఆర్కే పురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ పార్కులో పంచాంగ శ్రవణ కార్యక్రమం అభ్యుదయ మహిళా మండలి, గ్రీన్ హిల్స్ కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాగోల్ కు చెందిన ఆదిశేష శర్మ పంచాంగ శ్రవణమును శ్రోతులకు వినిపించారు. ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసే పండుగ ఉగాది అని ఆరు రుచులతో ఆరంభం మనసుకు తెచ్చేను తరగని సంతోషం పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచులతో సంఘమంగా మారాలని అన్నారు. సరికొత్త ఆశలు నిండైన నవ్వుల ఆనందం శ్రేయస్సు సంతృప్తిని కొత్త కళలతో కొత్త ఆశలతో కొత్త భావాలతో కొత్త ఆలోచనలతో జీవితంలో మరింత ముందుకు పోవాలని మరింత ఎదగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రోడ్ నెంబర్ – 3 లోని అనాధ శరణాలయానికి ఉగాది పండుగ సందర్భంగా పిండి వంటలు, పులిహోర అందజేశారు.ఈ కార్యక్రమంలో అభ్యుదయ మహిళా మండలి అధ్యక్షురాలు పుష్పలత రెడ్డి, సెక్రెటరీ అర్చన ట్రెజరర్ కృష్ణవేణి వైస్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి విజయలక్ష్మి,
కాలనీ ప్రముఖులు పాశం సురేందర్ రెడ్డి, సతీష్, ధనంజయ సేతు మాధవ, కే .వి. రావు, పైలా సంజీవరెడ్డి, యాదయ్య గౌడ్, పంతులు అదిశేషా శర్మ బండ్లగూడ, నరసి రెడ్డి లింగస్వామి గౌడ్, వేణు గోపాల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
