

ఖబర్దార్ రేవంత్ సర్కార్
హెచ్.సి.యు. భూముల జోలికొస్తే రాష్ట్ర ప్రభుత్వం పతనం తప్పదు
మనన్యూస్,కామారెడ్డి:జిల్లా కేంద్రంలో భారతీయ విద్యార్థి మోర్చా (BVM) విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది,ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చా BVM కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అర్బాస్ ఖాన్ మాట్లాడుతూ
హెచ్.సి.యు. భూములను పెట్టుబడిదారులకు అప్పగించే ఆలోచనలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విరమించుకోవాలి అని కోరారు. మరియు
హెచ్.సి.యు. విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించి అక్రమ లాఠీ చార్జి, అరెస్టులకు పాల్పడిన పోలీసుల తీరు విద్యార్థుల భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం చాలా దుర్మార్గం.. అదేవిధంగా 1973 నుంచి హెచ్.సి.యు పరిధిలో ఉన్న భూమి రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా 2004 నుంచి ఒక్కసారిగా పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ 400 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి కార్పొరేట్ శక్తులకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ అధికారంలోకి వచ్చి ఆ ఇందిరమ్మ ఇచ్చిన భూమినే బహిరంగ మార్కెట్లో అమ్ముతానని ప్రకటించటం దారుణమైన విషయం, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తొలి తెలంగాణ ఉద్యమానికి ప్రతీక అయిన హెచ్.సి.యూ భూమిని యధాతథంగా ఉంచి పర్యావరణ రక్షణ , మూగజీవాల ప్రాణాలు కాపాడే విషయంలో నిజాయితీని, నిబద్ధతను, చాటుకోవాలి అనీ కోరారు..విద్యార్థులు జోలికి కానీ యూనివర్సిటీ ల జోలికి వస్తే విద్యార్థులు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గుణపాఠం తప్పదు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెరుమాండ్ల బుల్లెట్, కృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు..
