ముంబయి జట్టులో నా పాత్ర మాత్రమే మారింది.. మైండ్‌సెట్ కాదు: రోహిత్

Mana News :- ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌(Mumbai Indians)కు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించిన కెప్టెన్. కానీ, గతేడాది అతడిని సారథ్య బాధ్యతల నుంచి మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది.హార్దిక్‌ పాండ్యకు అప్పగించింది. ఆ తర్వాతే టీమ్‌ఇండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలను అందించడం గమనార్హం. ఈసారి ఐపీఎల్‌ (IPL 2025)లో మూడో మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది. ఆరంభం బాగా లేకపోయినా మళ్లీ పుంజుకుంటామనే దానికి ఈ మ్యాచ్‌ ఫలితం నిదర్శనమని రోహిత్ (Rohit Sharma) వ్యాఖ్యానించాడు. ”నేను కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి చాలా మార్పులు చేసుకుంటూ వచ్చా. మొదట్లో మిడిలార్డర్‌లో ఆడా. ఇప్పుడు ఓపెనర్‌గా వస్తున్నా. ముంబయి జట్టుకు కెప్టెన్‌గా పనిచేశా. ఇప్పుడు కాదు. నాతోపాటు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు సభ్యుల్లో కొందరు ఇప్పుడు కోచ్‌లుగా ఉన్నారు. కాబట్టి, పాత్రలు మారుతూ ఉంటాయి. కానీ, నా మైండ్‌సెట్‌ మాత్రం కాదు. జట్టు కోసం నేనేం చేయాలనుకుంటున్నానో అది మాత్రం మారలేదు. మ్యాచుల్లో గెలవాలి. ట్రోఫీలను సొంతం చేసుకోవాలి. ముంబయి ఇండియన్స్‌కు ఇదంతా తెలుసు. గత కొన్నేళ్లలో మేం ట్రోఫీలను గెలుచుకున్నాం. ఎవరూ నమ్మనివిధంగా పుంజుకొని విజేతలుగా నిలిచాం” అని రోహిత్ వెల్లడించాడు. వారి ఎంపికకు కారణమిదే..”ట్రెంట్‌ బౌల్ట్‌కు ఎంతో అనుభవం ఉంది. ముంబయి ఇండియన్స్‌ కల్చర్‌ ఏంటో తెలుసు. మిచెల్ శాంట్నర్ న్యూజిలాండ్ సారథి. అనుభవంతోపాటు క్లాస్‌ ప్లేయర్. విల్ జాక్స్, రీస్ టోప్లేతో జట్టులో వైవిధ్యం తీసుకొచ్చాం. రియాన్ రికెల్‌టన్ యువ క్రికెటర్. దూకుడుతోపాటు నిలకడగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. జట్టులో భారత్‌కు చెందిన చాలామంది యువకులు ఉన్నారు. వారితో కలిసి ఆడటం బాగుంది. ఇప్పుడున్న మా లక్ష్యం ఐపీఎల్‌ ట్రోఫీని నెగ్గడమే. మళ్లీ ముంబయి ఇండియన్స్‌కు వైభవం తీసుకురావడమే” అని రోహిత్ వ్యాఖ్యానించాడు. హార్దిక్‌ పాండ్య నాయకత్వంలో ముంబయి ఇండియన్స్‌ ఆడుతోన్న సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. అయితే, రోహిత్ మాత్రం బ్యాటర్‌గా విఫలం కావడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. మూడు మ్యాచుల్లో కలిపి 21 పరుగులు (0, 8, 13) మాత్రమే చేశాడు.

Related Posts

రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, 15 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మణికొండ మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా…

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 1 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు