

మనన్యూస్,మాచారెడ్డి:కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల వాడి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం ఎస్సై అనిల్ తన సిబ్బందితో కలిసి మంగళవారం
రోజు సాయంత్రం అందాజా ఆరు గంటలకు అక్కడికి వెళ్లి రైడ్ చేయగా వాడి గ్రామ శివారులో నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 22,260 రూపాయిలు 4 మొబైల్స్, రెండు బైక్స్ సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై అనిల్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ మాచారెడ్డి,పాల్వంచ మండల ప్రజలకు సూచించారు చట్టరీత్య నేరాలకు పాల్పడుతూ పేకాట ఆడితే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఎక్కడైనా పేకాట ఆడితే ప్రజలు 100 కి డయల్ చేసి పోలీసులకు తెలియజేయాలని కోరారు.
