

మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని కొలన్ శివారెడ్డి నగర్ కాలనీ నందు నూతనంగా నిర్మించిన డాల్ఫిన్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవీరెడ్డి శ్రీరెడ్డి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యానికి తన అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మన్సురాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, సీనియర్ నాయకులు జగదీష్ యాదవ్, టంగుటూరి నాగరాజు, అనిల్ కుమార్, నర్సింగ్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
