

మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రైవేట్ సింగిల్ మేనేజ్మెంట్ పాఠశాలల్లో పర్యవేక్షణ కమిటీలో డి శ్రీనివాసరావు నియామకం కావడం పట్ల స్థానిక ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఆయనను మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రైవేటు విద్యాసంస్థల్లో 25% సీట్లు కేటాయింపు పర్యవేక్షణకై , కేటాయించిన సీట్లకు ఇచ్చే ఫీజును నిర్ణయించుటకై ఏర్పరిచిన కమిటీలో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తో పాటుగా యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్న ఏలేశ్వరం ప్రైవేట్ స్కూల్స్ మండల్ అసోసియేషన్ కి చెందిన డి. శ్రీనివాసరావు అను నన్ను ఒక కమిటీ మెంబర్ గా తీసుకోవడం జరిగింది అన్నారు. మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుంకర రాంబాబు, ఏలేశ్వరం పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ డివివి సత్యనారాయణ లు మాట్లాడుతూ సెల్ఫ్ సస్టైనింగ్ సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్ యొక్క వాణిని బలంగా వినిపించడానికి ఇది ఒక గొప్ప అవకాశం అన్నారు. సన్మాన గ్రహీత శ్రీనివాసరావు మాట్లాడుతూ యూ పీ ఈ ఐ ఎఫ్ చైర్మన్ బాధ్యతను కల్పించిన యూ పీ ఈ ఐ ఎఫ్ ఫౌండర్ మతకుమల్లి విజయ్ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రైవేటు విద్యాసంస్థల యొక్క సాధకబాధకాలను కమిటీ ద్వారా ప్రభుత్వానికి తెలియ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పైల రాణా ప్రతాప్, లంక లక్ష్మణ్ కుమార్, చలంచర్ల రత్నాజీ, శ్రీనివాస్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
