

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):
ఏలేశ్వరం పట్టణంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా డొక్కా సీతమ్మ గారి సేవాసమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీచేపట్టారు. కార్యక్రమంలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం, విశ్వహిందూ పరిషత్,మాతృ శక్తి సభ్యులు పాల్గోన్నారు. బాలాజీ చౌక్ సెంటర్ నందు ఈ ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం చేపట్టారు.పలువురు ఉగాది పచ్చడి సేవించి ఆనందంవ్యక్తం చేశారు.పంపిణీ అనంతరం చల్లాచదురుగా పడవేసిన వ్యర్ధాలను సేవా సమితి సభ్యులు ప్రాంగణాన్ని శుభ్రం చేసి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏలేశ్వరం పరిసర గ్రామాల ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డొక్కా సీతమ్మ గారి సేవ సమితి తరపున ఉగాది పచ్చడి పంపిణీ చేపట్టటం శుభదాయకమని తెలిపారు ప్రజా జీవితంలో చేదు పులుపు వగరు తీపి పలు రుచిలు మాదిరిగానే మనిషి జీవితం ముడిపడి ఉంటుందని అన్నారు. ఈ ఉగాది పండుగ అందరి జీవితాలలో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మోల్లిపాక నాగేంద్ర, సిరి ఫుడ్స్ కృష్ణ, సుబ్రహ్మణ్యం, పంపన బుజ్జి, కర్ర గోవింద్, నడిగట్ల వెంకన్న, వరుపులు చిన్న, ఆకుల సూరిబాబు, పాబోలు దేవి బుగత సుగుణ, అలమండ ప్రసాద్, గట్టిం రమణ, కిరీటి, గొల్ల నాగేశ్వరరావు, తిరగట్టి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు