

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నాణ్యతతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆడిషనల్ డిఆర్డీవో వామాన్ రావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రం నుంచి ప్రాజెక్టుకు వెళ్లే రహదారి సీసీ రోడ్లు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు పడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,ఎంపీడీవో గంగాధర్,ఏపీవో శివకుమార్,నాయకులు రాము రాథోడ్ తదితరులు ఉన్నారు.
