42మంది పోలీస్ సిబ్బంది తో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం


మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ జిల్లా నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం:
యువత బెట్టింగ్ సైడ్ వెల్లి జీవితాలను నాశనం చేసుకోవద్దు
గద్వాల సీఐ టి.శ్రీను.జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం లోని తెలుగు పేట, బీసీ కాలని , శివాలయం , రవీంద్ర స్కూల్ ఏరియాలో సాయంత్రం 5:30 గంటల నుండి 07:30 గంటల వరకు గద్వాల సీఐ శ్రీ టి. శ్రీను ఆధ్వర్యంలో ఎస్ఐ లు-06, అర్.ఎస్సై లు -03, పోలీస్ సిబ్బంది మొత్తం 42 మంది సిబ్బంది తో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మూడు పార్టీలుగా విడిపోయి నాలుగు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వ్యక్తిగత వివరాలు సేకరించి, వారిని పేస్ రికగ్నిషన్ సిస్టం యాప్ ద్వారా, వారి వేలిముద్రలు తీసుకొని వారిపై గతంలో ఏదైనా నేరాలు ఉన్నాయా అనే విషయాన్ని చెక్ చేసి సుమారు 200 ఇళ్లను సోదాలు నిర్వహించడం జరిగింది. సరైన పత్రాలు లేని 79 ( ద్విచక్ర వాహనాలు -67, ఆటో లు-10, ఫోర్ వీలర్ -02) వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి , ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుసుకునేందుకు మరియు చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారా వంటి విషయాలు తెలుసుకెందుకు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
అలాగే యువత బెట్టింగ్ సైడ్ వెళ్లి ఆర్థికంగా నష్ట పోయి తమ విలువైన మంచి భవిష్యత్తు ను నాశనం చేసుకోవద్దని అన్నారు.కష్టపడకుండా డబ్బులు రావనే విషయాన్నీ గ్రహించాలని అన్నారు.
వాహన దారులు తప్పకుండా అన్ని డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్, ఇన్స్యూరెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి కొత్త చట్టాలలో జరిమానాలు, శిక్షలు పెంచడం జరిగిందన్న విషయన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు.
మహిళల భద్రతే పోలీస్ ప్రధాన లక్ష్యం అని, మహిళ పట్ల, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, వారిని మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలుచేపట్టి కేసులు నమోదు చేయడం జరుగుతుంది, వారి రక్షణ కోసం షి టీమ్స్ నిరంతరం పని చేస్తున్నాయని అన్నారు..వాహనాలకు సంబంధించి సరైన ధృవ పత్రాలు చేక్ చేసి తమ వాహనాలు తిరిగి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ప్రజలు, మహిళలు ఆపద సమయంలో, ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన, యువకులు గుంపులు గా ఏర్పడి బహిరంగ మద్యపానం సేవించిన, ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజల రక్షణ కొరకు పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు అని తెలిపారు. వ్యాపార సముదాయాల దగ్గర, కాలనీ లలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మీ కాలనీ లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీస్ లేదా డయల్ 100 కు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు. సైబర్ నేరాల పాట్ల జాగ్రత్తగా ఉండాలనీ, మొబైల్ ఫోన్స్ లను జాగ్రత్తగా వినియోగించాలని, చిన్న చిన్న తప్పులతో విలువైన డబ్బులను పోగొట్టుకోవద్దు అని, ఎవరైనా సైబర్ నేరాల కు గురైతే వెంటనే 1930 కు కాల్ చేయలని లేదా లోకల్ పోలీస్ లను సంప్రదించాలని అన్నారు. అనంతరం పొక్సో కేసుల నమోదు, శిక్షలు , బాల్య వివాహాలు, బాల్య కార్మిక వ్యవస్థ పర్యవ్యాసనల గురించి, ట్రాపిక్ రూల్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గద్వాల సర్కిల్ ఎస్సై లు , అర్ . ఎస్సై లు, పోలీస్ సిబ్బంది, కాలని ప్రజలు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 7 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//