

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని భద్రవరం గ్రామంలో విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య సమీక్షించుటకు మండల వ్యవసాయ అధికారిని
బి.జ్యోతి ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించినారు.ఇందులో భాగంగా మండలంలో ఇప్పటికే ఐదువేల మంది రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది రిజిస్టర్ చేయడం జరిగిందని,భద్రవరం రైతులు 200 మంది ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలియజేశారు.పెండింగ్ ఉన్న రైతులు పేర్లు లిస్టులో చదివి వినిపించారు.విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారానే పీఎం కిసాన్,అన్నదాత సుఖీభవ,ఇన్సూరెన్స్,పంట నష్టం, ధాన్యం కొనుగోలు వంటివి జరుగుతాయని రైతులకు తెలియజేశారు.పొలం ఉండి గ్రామంలో లేని రైతులకు ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామని ఈ విషయం తమ బంధువులకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వేసవిలో విత్తుకునే అపరాల విత్తనాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూనపు రెడ్డి సుబ్బారావు,గ్రామ నాయకులు జిగటాపు సూరిబాబు,వీఆర్వో బాలరాజు,సత్య అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్,సింహాద్రి అగ్రికల్చర్ అసిస్టెంట్,బందెల బాబ్జి,ఏనుగంటి అప్పారావు,రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.