

మనన్యూస్,నెల్లూరు:రాంజీ నగర్ ఆఫీస్ లో గురువారం వైసీపీ నగర నియోజకవర్గ మైనారిటీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇమామ్ లు, మౌజాన్ లకు రంజాన్ తోఫా అందజేశారు.ఈ సందర్భంగా పలువురు ముస్లిం నేతలు, కార్యకర్తలకు, ప్రజలకు చంద్రశేఖర్ రెడ్డి రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ………రంజాన్ మాసంఎంతో పవిత్రమైనదన్నారు.
రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు ఉపవాస దీక్షలు చేపట్టి భక్తిశ్రద్ధలతో అల్లాను ప్రార్థించడం జరుగుతుందన్నారు.రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ప్రతి ఒక్కరు.. ఎంతో సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు అని అన్నారు.
ముఖ్యంగా నెల్లూరు నగర నియోజకవర్గ మసీదుల్లో అల్లా గురించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ఇమామ్ లు, మౌజాన్ లకు.. రంజాన్ తోఫాలో భాగంగా వస్త్రాలు, పౌష్టికాహారం అందజేస్తున్నామని తెలిపారు.
రంజాన్ తోఫాను ప్రతి మసీదుకు స్వయంగా వెళ్లి అందజేయడం జరుగుతుందన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రతి ఎస్సీ, ఎస్టీ బీసీ,మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
