

మనన్యూస్,నెల్లూరు:మర్కస్ మసీద్, అభుజర్ మసీద్, అమీనియా, మసీద్ ఇలా పలు మసీదులకు గురువారం వైసిపి నగర నియోజకవర్గ మైనార్టీ నాయకులతో కలిసి నెల్లూరు సిటీ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా వెళ్లి ఇమామ్, మౌజాన్లకు రంజాన్ తోఫా అందజేశారు.ఈ సందర్బంగా మసీదుల్లోముస్లిం మత పెద్దలతో కలిసి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం ఇమామ్ మౌజన్ లకు రంజాన్ తోఫాలో భాగంగా చంద్రశేఖర్ రెడ్డి వస్త్రాలు, పౌష్టికాహారం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు ముస్లిం మత పెద్దలను కలిసి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు
