

మనన్యూస్,కొండాపురం:కొండాపురం మండలంలోని మక్కినవారిపాలెం, వెల్లటూరి వారి పాలెం, ఇసుకపాలెం,బొమ్మిపాలెం, భీమార్పాడు గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు రోజుల కిందట సాయి పేట ఎస్సీ కాలనీ సమీపంలో మెయిన్ పైప్ లైన్ దెబ్బతింది. మరమ్మతులు చేయలేదు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈకి సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. నేను లేక దిష్టిబొమ్మల ట్యాంకులు దర్శనమిస్తున్నాయని గ్రామాలలో ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చెందుతున్నారు.ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి పలు గ్రామాలలో నీటి వసతి కల్పించవలసిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు.
