

మనన్యూస్,తిరుపతి:ఈ నెల 31వ తేది జరిగే రంజాన్ ప్రార్థనల కోసం ఈద్గా మైదానంలో మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ కార్పోరేషన్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సహాయ కమిషనర్ అమరయ్య, ఇంజినీరింగ్ అధికాలు పరిశీలించారు. గురువారం ఉదయం మైదానంలో జరుగుతున్న పనులును పరిశీలించి శనివారం నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదేశించారు. ముస్లీంలను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి తెలిపారు. నెల రోజుల పాటు ఎంతో నిష్టతో అల్లాను ముస్లీంలు ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోందని ఆయన చెప్పారు. ముస్లీంల ప్రార్థనలు ఫలించాలని ఆయన కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అల్లా దయ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ముస్లీం సోదరులు, రైల్వే శాఖ మధ్య నలుగుతున్న ఈద్గా మైదాన సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, ఈద్గా కమిటీ నూతన ఛైర్మన్ రఫీ, మహబూబ్ బాషా, ఎస్ కే బాబు, నరసింహాచ్చారి, బుల్లెట్ రమణ, జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి, జీవకోన సుధా, కెఎంకే లోకేష్, పాటకం వెంకటేష్, కూరపాటి సురేష్, హేమంత్ కుమార్, రాజేష్ ఆచ్చారి, రమేష్ నాయుడు, కొండా రాజమోహన్ తదితరలు పాల్గొన్నారు.
