

మనన్యూస్,నెల్లూరు:రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్, శోధన్ నగర్ మున్సిపల్ పార్క్ స్థలాన్ని గురువారం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తో కలసి పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు నగర మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ.నుడా నిధులతో పార్కును అభివృద్ధి చేసేందుకు నిధులను అతి త్వరలో మంజూరు చేసి పార్కును అభివృద్ధి చేసి, ప్రజలకు అంకితం చేస్తాం అని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం నుడా నుండి నిధులు కేటాయిస్తున్న నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కి నా ప్రత్యేక ధన్యవాదములు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో టిడిపి నాయకులు మదర్ భాయ్, రియాజ్, శెట్టిపల్లి అనిల్, మల్లికార్జున్ రెడ్డి, బషీర్, శ్రీను, మహేష్, విష్ణు ప్రియ, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
