ఇది మంచి ప్రభుత్వం – మంచి పాలన..ఎమ్మెల్యే సత్యప్రభ ప్రోత్సాహంతో నియోజకవర్గం అభివృద్ధి..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) మంచి ప్రభుత్వం లో మంచి పాలన కొనసాగుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ (టి ఎన్ టి యు సి) రాష్ట్ర ఉపాధ్యక్షులు, టిడిపి సీనియర్ నేత వెన్నా ఈశ్వరుడు (శివ), శంఖవరం మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు బద్ది రామారావు, కీర్తి సుభాష్, కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ అన్నారు. గురువారం కత్తిపూడి శివారు సీతంపేట లో పిర్ల అప్పారావు ఆధ్వర్యంలో శంఖవరం మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. టిడిపి నాయకులు బద్ది రామారావు, వెన్నా శివ, కీర్తి సుభాష్,కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ 15.83 కోట్లు నిధులు విడుదలయ్యాయని అన్నారు. దీనిలో భాగంగా శంఖవరం మండలానికి బీటీ రోడ్లకు సుమారు 3 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికై మండలంలోని గ్రామాల్లో కొన్ని లక్షలతో సీసీ రోడ్లు వేయడం జరిగిందని, 2వ విడత సీసీ రోడ్లు శంఖవరం మండలానికి 80 లక్షలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కత్తిపూడి జాతీయ రహదారి నుంచి వజ్రకూటం గ్రామానికి రూ 1.98 కోట్లు, కొంతంగి నుంచి గొంది కొత్తపల్లి కి రూ 2.20 కోట్లుతో బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, శంఖవరం లో 10 లక్షలు, కత్తిపూడి 15 లక్షలు, వజ్రకూటం 6 లక్షలు, సీతంపేట 8 లక్షలు, అన్నవరం 10 లక్షలు, మండపం 8 లక్షలు, నెల్లిపూడి 10 లక్షలు, కొంతంగి 8 లక్షలతో ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. వైసిపి పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గాడిలో పెట్టి, అన్ని విధాలుగా అభివృద్ధి చేసి 9 నెలలుగా మంచి పాలన అందిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే సత్య ప్రభ చిత్తశుద్ధితో పనిచేస్తూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని గ్రామాల్లో రోడ్లు, రూపురేఖలు మారుస్తున్నారని, సత్యప్రభ కృషితో మండలాన్ని మరింత అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉల్లి వీరభద్రరావు, సాధనాల లక్ష్మీ బాబు, కేలంగి జనార్ధన్, కర్ణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, బొమ్మిడి సత్యనారాయణ, పోలం చిన్న, ఈగల దేవుళ్ళు,బద్ది రామకృష్ణ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు