

మనన్యూస్,ఉదయగిరి:పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 27 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న భవనానికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్ను బోయిన చంచల బాబు యాదవ్ ఉదయగిరి ఎంపీపీ మూలే పద్మజా మూలే వినయ్ రెడ్డి, మండల కన్వీనర్ సిహెచ్ బయన్న, ఎంపీడీవో అప్పాజీ, స్థానిక మండల నాయకులు, అధికారుల సారధ్యంలో పురోహితుల సమక్షంలో నడుమ కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచులు అధికారులు అనధికారులు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.
