

మనన్యూస్,ఉదయగిరి:సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ సీనియర్ నాయకులు, ఆవుల రోశయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, ఆదివారం పరామర్శించారు. ఇటీవల ఆయన కుమారుడు ఏ వెంకటేశ్వర్లు లివర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆయన కుటుంబ సభ్యులను రోశయ్యను ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా రోశయ్య ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ తగిన సహాయం అందజేస్తానని తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందేలా చూస్తానని తెలియజేశారు.రోశయ్య కుమార్తెకు ఉపాధి కావాలని కోరగా అవకాశం కల్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిహెచ్ బయన్న నల్లిపోగు నరసింహులు ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.
