

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నామని పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ అన్నారు. బుధవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులను
పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ లతో కలిసి భీమ పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. మండల అభివృద్ధికి కృషి చేస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్యం కాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు మంగలి కృష్ణ,నాయకులు లక్ష్మయ్య, బలరాం,బంగ్లా ప్రవీణ్,అంజయ్య,విఠల్,రవి, సాయిలు,గ్రామస్థులు తదితరులు ఉన్నారు.

