

మనన్యూస్,నెల్లూరు:ఆచారి వీధి లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వైసిపి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మున్వర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్వీకరించారు.అనంతరం పలువురు ముస్లిం నేతలను చంద్రశేఖర్ రెడ్డి ఆప్యాయంగా పలకరించి రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కరిముల్లా , వేలూరు ఉమా మహేష్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు హంజా హుస్సేని , వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డి ,జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్ ,మాజీ ఏఎంసీ చైర్మన్ పెర్నెటి కోటేశ్వర రెడ్డి , జిల్లా యాక్టివిటీ కార్యదర్శి జహీద్ , నేతలు యస్థాని , మహబూబ్ బాషా , అలీమ్, కందుకూరు రమేష్ , కిషన్ ,పెంచలయ్య, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
