

మనన్యూస్,శంఖవరం:కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ శంఖవరం నందు తేదీ 27 వ తారీకున గురువారం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఓరియంటేషన్ క్లాసు అవగాహన సదస్సు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కె. కృష్ణవేణి అన్నారు. ఈ అవగాహన సదస్సులో ఓఎంఆర్ లో పరీక్ష రాసే విధానం మరియు ప్రవేశ పరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్ గురించి విద్యార్థులకు వివరించడం జరుగుతుంది. కాబట్టి 6వ తరగతి ప్రవేశపరీక్షకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ అవగాహన సదస్సుకు మీ తల్లిదండ్రులతో గాని, ఉపాధ్యాయులతో గాని హాజరవ్వాలని తెలిపారు. ఇంకా ఎవరైనా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోలేనటువంటి విద్యార్థులు ఉంటే విద్యార్థి ఆధార్,తల్లిదండ్రుల ఆధార్ కార్డులు (ముగ్గురు ఆధార్ కార్డులు) పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్యాస్ట్ తో కూడిన స్టడీ సర్టిఫికెట్ తో మోడల్ స్కూల్ కి వచ్చినట్లయితే ప్రవేశ పరీక్ష ఫీజు కట్టుకున్న విద్యార్థికి ఫ్రీగా ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా శంఖవరం మండలం మండల విద్యాశాఖ అధికారి ఎస్.వి.రమణ, టి. గోవింద్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కె. కృష్ణవేణి తెలియజేశారు.
