

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు:
ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన జిల్లాలో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన 28 మంది బాధితులకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ 30 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాల వారు ఎమ్మెల్యే సత్యప్రభకు కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 30 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యేలా చేసి ఇన్ని పేద కుటుంబాలకు ఆసరాగా నిలిచిన ఎమ్మెల్యే సత్య ప్రభ కృషిని మరువలేమన్నారు.చెక్కుల ను లబ్ధిదారులకు,వారి కుటుంబాలకు అందజేసిన ఎమ్మెల్యే సత్య ప్రభ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరం వంటిది అన్నారు.ఇప్పటివరకు వందమందికి పైగా బాధిత కుటుంబాలకు దాదాపు కోటి రూపాయల విలువైన నిధులను మంజూరు చేయించడం జరిగిందని, ఈరోజు మరో 30 లక్షల రూపాయల చెక్కులను పేదలకు అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్నా ఈశ్వరుడు (శివ),తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ మూది నారాయణ స్వామి,పంచాది వీరబాబు,నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.