

మనన్యూస్,నారాయణ పేట:నారాయణపేట జిల్లా పరిధిలోని ఊట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఇలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న డాక్టర్ను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవసలోని పల్లి గ్రామ శివారులో ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఇసుక ట్రాక్టర్ యజమాని డ్రైవర్ సాల రాము సన్నాఫ్ గంగప్ప వసలోని పల్లి గ్రామనికి చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమ ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
