

మనన్యూస్,పిఠాపురం:ఇందిరానగర్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్య అధికారి డాక్టర్ బి. జయరామ్ ఆధ్వర్యంలో మార్చి 24వ తేదీన “ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం” సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది, స్టాఫ్ నర్సులు, ఎ ఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
క్షయ వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన పెంచడం, వ్యాధిని నివారించే మార్గాలను తెలియజేయడం, మరియు వ్యాధి సోకిన వారికి సరైన చికిత్స అందించడం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం.డాక్టర్ బి. జయరామ్ మాట్లాడుతూ, “క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలందరి సహకారం అవసరం. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వం అందించే ఉచిత చికిత్సను సద్వినియోగం చేసుకోవాలి” అని తెలిపారు.ఈ ర్యాలీలో పాల్గొన్న సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు ఇందిరానగర్ వీధుల్లో తిరుగుతూ క్షయ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
