అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు

మనన్యూస్,పిఠాపురం:మండలం ఎఫ్.కె పాలెం-విరవాడ గ్రామాల మధ్యలో ఉన్న సుమారు 100 ఎకరాల పాపిడి దొడ్డు చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతుండడంపై ఎఫ్.కె. పాలెం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తవ్వకాలను నిలుపుదల చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ శన్మోహన్ సగిలి కు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.అనంతరం పెద్దాపురంలో ఉన్న నీటిపారుదల శాఖ ఈఈ శేషగిరిరావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతులు ముమ్మిడి వెంకన్న బాబు, మలిరెడ్డి పల్లపు రాజా, ముమ్మిడి వీరబాబు, రామిరెడ్డి శ్రీను, ముమ్మిడి తాతికొండ తదితరులు మాట్లాడుతూ పాపిడి దొడ్డి చెరువులో ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు ఇటుక బట్టీల యజమానులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టడం శోచనీయమన్నారు. ఈ సందర్భంగా మట్టి అక్రమంగా తవ్వి తరలించడానికి తీసుకొచ్చిన జెసిబి, లారీలను ఆదివారం అడ్డుకున్నామన్నారు.అనేకమంది రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందిస్తున్న ఈ చెరువులో మట్టి తవ్వకాలు చేపడితే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సాగునీరు సక్రమంగా అందని పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఏర్పడి రైతాంగానికి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఈ చెరువులో తవ్వకాలు జరిపారని, ఇప్పుడు మరోసారి అక్రమ తవ్వకాలు చేపడితే పెద్దపెద్ద గోతులు ఏర్పడి ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. గతంలో తవ్వకాలు జరపగా అనేక పశువులు మృత్యువాత పడ్డాయి అన్నారు. మనుషులు కూడా ప్రమాదాలకు గురైన సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అనుమతులు లేకుండా వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి అక్రమ తవ్వకాలు ఏమిటని ఈ సందర్భంగా రైతులు ప్రశ్నించారు.ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళతామని తెలిపారు. అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హైకోర్టులో కేసు వేస్తామని తెలిపారు.

  • Related Posts

    అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

    శంఖవరం మన న్యూస్ (అపురూప్) ; జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పాలనా వికేంద్రీకరణకు గుర్తుగా “మా పంచాయతీ – మా గౌరవం” పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ సదస్సును గురువారం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్…

    సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) ఏలేశ్వరం మండలం యర్రవరంగ్రామములో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం నందు పేరెంట్స్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ముక్కు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు సింగిలిదేవి సత్తిరాజులు హాజరయ్యారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

    • By APUROOP
    • April 24, 2025
    • 2 views
    అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

    సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

    సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    • By JALAIAH
    • April 24, 2025
    • 6 views
    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు