తండ్రి ఇంటిపై కుమారుడి కాల్పులు

Mana News ,నెల్లూరు:- వ్యసనాలకు బానిసయ్యాడు. తండ్రి, సోదరుల వివాదం పెట్టుకున్నాడు. ఆస్తిలో వాటా తీసుకున్నాడు. సొంత వ్యాపారం పెట్టాడు. నష్టాలు రావడంతో తండ్రి ఇంటికొచ్చి బెదిరింపులకు దిగాడు. విచక్షణ కోల్పోయి తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఈఘటన నెల్లూరులో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఆచారి వీధికి చెందిన రాజ్‌మల్‌జైన్‌కు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు దిలీప్‌కుమార్‌జైన్, మూడో కుమారుడు మనోజ్‌కుమార్‌జైన్‌ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. రెండో కుమారుడు హితేష్‌కుమార్‌జైన్‌ అలియాస్‌ జతిన్‌జైన్‌ వ్యసనాలకు బానిసై వివాహానంతరం శిఖరం వారి వీధిలో వేరుగా ఉంటున్నాడు. తండ్రి నుంచి ఇప్పటికే రూ.40 లక్షలు తన వాటాగా తీసుకున్నాడు. ఆ నగదుతో బెంగళూరులో వ్యాపారం చేసి నష్టపోయాడు. అయిదు సంవత్సరాల నుంచి సుబేదారుపేటలో దుర్గ గ్లాస్, ప్లైవుడ్‌ దుకాణం నిర్వహిస్తుండగా నష్టాలు వచ్చాయి. అప్పటినుంచి ఆస్తిలో వాటా కావాలని తల్లిదండ్రులు, అన్నదమ్ములను వేధిస్తున్నాడు. అప్పుడప్పుడు వచ్చి తండ్రితో గొడవ పడుతున్నాడు. ఈ నెల 11న వచ్చి ఆస్తి పంపకాలు చేస్తారా? లేకుంటే తుపాకీతో కాల్చుకుంటానని బెదిరించాడు. పేలకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. శనివారం అర్ధరాత్రి అయిదుగురితో వచ్చి ఇంటి తలుపులు తెరవాలని గొడవ చేశాడు. కేకలు వేస్తూ బీభత్సం సృష్టించాడు. ఎవరూ రాకపోవడంతో లైసెన్సు కలిగిన పిస్తోల్‌తో ఒక రౌండు ఇంటి తలుపులపై కాల్చాడు.
ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. భయాందోళనలో ఉన్న బాధితులు ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు ఫిర్యాదు చేశారు. చిన్నబజారు పోలీసులను అప్రమత్తం చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడితో పాటు అతని వెంట వచ్చిన అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తుపాకీతో కాలుస్తున్న హితేష్

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 1 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు